నిజాం పాలన బెటర్ అంటే దేశద్రోహుమే: నారాయణ

Narayana
హైదరాబాద్: ప్రస్తుత పాలన కంటే నిజాం ప్రభుత్వ పాలననే బాగుండేదనే నేతలు, నాయకులు వ్యాఖ్యలు దేశద్రోహమే అవుతాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆదివారం అన్నారు. నిజాం పాలనే బెటర్ అనటం దేశద్రోహమే అవుతుందన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసేవారు బానిసలకంటే హీనమన్నారు. తెలంగాణ అంశం ఆలస్యమయ్యే కొద్ది ఉద్యమం నేతల నుంచి జారీపోయే అవకాశం ఉందన్నారు. తెలంగాణ సమస్యను కేంద్రం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

రైతాంగ సమస్యలపై ప్రభుత్వం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే అఖిల పక్షాన్ని న్యూఢిల్లీ తీసుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి దీక్షకు కొంగ జపానికి పెద్దగా తేడా లేదని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+