పొన్నాల ఇంటిముందు చావుడప్పు, జానా ఘెరావ్

మహబూబ్ నగర్‌లో పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్‌ని తెలంగాణవాదులు అడ్డుకున్నారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ కోసం రాజీనామా చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని పలు ఊళ్లలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. సింగరేణి కార్మికుల అరెస్టును నిరసిస్తూ ఖమ్మం, వరంగల్, నల్గొండ తదితర జిల్లాల్లో జెఏసి కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. రాస్తారోకో చేశారు.
మంత్రి జానారెడ్డిని నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో తెలంగాణవాదులు ఘెరావ్ చేశారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసుల సహాయంతో ఆయన బయట పడ్డారు. సమ్మెకు మద్దతుగా ఆసుపత్రులలో వైద్యులు, నర్సులు భోజన విరామ సమయంలో తమ ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications