గాలి రిమాండ్ పొడగింపు, కోర్టులో కన్నీటి పర్యంతం

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్ధన్ రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ ఎండి శ్రీనివాస్ రెడ్డికి నాంపల్లి ప్రత్యేక కోర్టు అక్టోబర్ 3వ తేది వరకు జ్యూడిషియల్ కస్టడీకి విధించింది. వారం రోజుల పాటు తమ కస్టడీలో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను సిబిఐ అధికారులు సోమవారం నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఓ వైపు తనకు బెయిలు ఇవ్వాల్సిందిగా గాలి, శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ వేయగా మరోవైపు వారి కస్టడి మరో వారం రోజులు పెంచాల్సిందిగా సిబిఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు న్యాయమూర్తి వారిని అక్టోబర్ 3వ వరకు జ్యూడిషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించారు. ఇరవై రోజులుగా జైలు జీవితం గడుపుతున్న గాలి ఈ రోజు కోర్టు ప్రాంతంలో కన్నీటి పర్యంతమయ్యాడు.

కస్టడీలో మీకేమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని న్యాయమూర్తి గాలి జనార్ధన్ రెడ్డిని ప్రశ్నించగా అదేమీ లేదని తన అరెస్టే అన్యాయమని ఆయన సమాధానం ఇచ్చారు. కాగా గాలి కేసుకు తెలంగాణ సెగ తగిలింది. గాలి బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు వాదిస్తున్న సమయంలో సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న తెలంగాణ ప్రాంత న్యాయవాదులు ఫైళ్లను విసిరారు. వాదనలు జరగకుండా అడ్డుకున్నారు. దీంతో వాదనలు వినిపించడానికి గాలి న్యాయవాదులకు ఇబ్బంది కలిగింది. న్యాయవాదులు కోర్టులో జై తెలంగాణ అంటూ నివాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+