ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై అంబటి సినిమా?

Ambati Rambabu
హైదరాబాద్: ప్రతీకారం తీర్చుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై ఓ సినిమా తీయాలనే ప్రయత్నంలో ఉన్నారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఓ వైబ్‌సైట్ ఈ విషయంపై ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. అయితే, అందులో ఏ మేరకు నిజం ఉందనేది తెలియదు. అంబటి రాంబాబు రాసలీలల కథనాన్ని ఎబిఎన్ ఆంధ్రజ్యోతిలో వార్తాకథనాన్ని ప్రసారం చేసిన రాధాకృష్ణపై అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. రాధాకృష్ణపై ఆయన తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు.

స్వర్గీయ ఎన్టీ రామారావును గద్దె దించడంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వేమూరి రాధాకృష్ణ సహకరించారనే విషయం అందరికీ తెలిసిందే. దాన్ని కథావస్తువుగా తీసుకుని అంబటి రాంబాబు సినిమా తీయాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రతిగా చంద్రబాబు నుంచి రాధాకృష్ణ ప్రతిఫలం పొందారని అంబటి రాంబాబు అంటున్నారు. ఓ సాధారణ విలేకరి స్థాయి నుంచి ఓ ప్రముఖ దినపత్రికను సొంతం చేసుకునే స్థాయికి ఎదిగిన తీరుపై మాస్ మసాలాతో సినిమా తీయాలనేది అంబటి రాంబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఇందులో ఇతరేతర మసాలా కూడా ఉంటుందట. అది కూడా అంబటి రాంబాబు వేమూరి రాధాకృష్ణపై చేసిన తీవ్ర ఆరోపణలకు సంబంధించే ఉంటుందని అంటున్నారు.

తాను తీయబోయే సినిమా గురించి అంబటి రాంబాబు ఓ దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు ఆ వెబ్‌సైట్ రాసింది. ఊరూ పేరూ లేని నటుడిని పెట్టి సినిమా తీయాలని అంబటి అనుకుంటున్నట్లు చెబుతున్నారు. రాధాకృష్ణ ప్రతిష్టను దెబ్బ తీయడమే సినిమా తీయాలనే అంబటి రాంబాబు యోచనలోని ప్రధానాంశమని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+