నిరవధిక నిరాహార దీక్షపై వెనక్కి తగ్గిన కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరోసారి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలనే యోచనకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వెనక్కి తగ్గినట్లు అర్థమవుతోంది. రెండు మూడు రోజుల్లో దీక్ష చేపట్టాలని ఆయన మొదట అనుకున్నారు. ఆ తర్వాత గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన దీక్ష ప్రారంభించాలని భావించారు. అయితే, అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో ఆయన తన ఆలోచనను మానుకున్నట్లు చెబుతున్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు కూడా దీక్ష వద్దనే చెబుతున్నారు. దీక్షకు కెసిఆర్ ఆరోగ్యం సహకరించదని, పైగా దీక్ష చేపడితే ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉంటుందని శాసనసభ్యుడు, ఆయన కుమారుడు కెటి రామారావు బహిరంగంగానే చెప్పారు. దీక్ష వద్దని చెబుతున్నామని ఆయన కూతురు కల్వకుంట్ల కవిత కూడా చెప్పారు.

కాగా, పార్టీ నాయకులతో తాను దీక్ష చేపట్టబోయే విషయంపై కెసిఆర్ సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దీక్ష వద్దని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారని కెసిఆర్ మంగళవారం ఓ సభలో చెప్పారు. అవసరం వచ్చినప్పుడు దీక్ష చేస్తానని ఆయన అన్నారు. దీన్ని బట్టి ఇప్పటికిప్పుడు ఆయన దీక్ష చేపట్టే ఆలోచనను విరమించుకున్నట్లు అర్థమవుతోంది. పైగా, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు కె. కేశవరావు భేటీ కూడా కెసిఆర్ ఆలోచనలో మార్పు తెచ్చినట్లు సమాచారం. దీక్ష ఇప్పుడు అవసరం లేదని కెసిఆర్‌కు తాను చెప్పినట్లు కేశవరావు చెప్పారు. వారిద్దరి మధ్య మరే విధమైన మంతనాలు జరిగాయనేది తెలియదు. కెసిఆర్ దీక్షకు బదులుగా అక్టోబర్ మొదటివారంలో పెద్ద యెత్తున హైదరాబాదు ముట్టడి చేపట్టాలనే ఆలోచన సాగుతోంది.

ఇదిలా వుంటే, కెసిఆర్ మంగళవారం సాయంత్రం తెలంగాణ రాజకీయ జెఎసి, ఉద్యోగ సంఘాల జెఎసి నాయకులతో సమావేశమయ్యారు. సకల జనుల సమ్మెపై, తాను చేపట్టబోయే దీక్షపై కెసిఆర్ ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. తమ సమ్మె నిరవధికంగా సాగుతుందని ఆర్టీసి కార్మికులు చెప్పారు. అలాగే, సకల జనుల సమ్మె జరిగినన్ని రోజులు తెలంగాణలో పాఠశాలలు మూసేయాలనే నిర్ణయం కూడా జరిగింది. సమ్మె తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. తమకు అదనపు విద్యుత్తు, గ్యాస్, బొగ్గు కేటాయించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కోరారు. ఈ మేరకు ఆయన మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేశారు. ఆర్టీసి కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను అన్నింటినీ సమావేశంలో కెసిఆర్ చర్చించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+