ఒక సంఘటన: సాక్షి, ఆంధ్రజ్యోతి వేర్వేరు వెర్షన్స్

యంగిస్థాన్ అనే కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, వేమూరి రాధాకృష్ణ పాల్గొన్నారు. కొండా రాధాకృష్ణ అనే విద్యార్థి ఈ కార్యక్రమంలో వేమూరి రాధాకృష్ణపై ప్రశ్నల వర్షం కురిపించాడని సాక్షి దినపత్రిక రాసింది. సాధారణ విలేకరి స్థాయి నుంచి ఓ పత్రికాధిపతి కావడం, ఎన్టీఆర్‌ను గద్దె దించేందుకు చంద్రబాబుకు అనుకూలంగా కుట్ర పన్నడంపై ఆ విద్యార్థి రాధాకృష్ణను నిలదీశాడని సాక్షి రాసింది. దానిపై రాధాకృష్ణ మాట్లాడలేకపోయారని రాసింది. కాగా, మహిళా లోకాన్ని కించపరిచిన ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ ఎండి వేమూరి రాధాకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని మహిళలు నినాదాలు చేశారని సాక్షి దినపత్రిక రాసింది.
'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై దాడి చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యత్నించారని, 'యంగిస్థాన్' కార్యక్రమం నిర్వహించేందుకు ఇక్కడి గాయత్రీ ఇంజనీరింగ్ కళాశాలకు రాధాకృష్ణ సోమవారం వచ్చారని, ఆయన తిరిగి వెళ్లేటప్పుడు దాడి చేయాలని వైఎస్సార్ పార్టీ నాయకులు, ఒక రోత పత్రిక యాజమాన్యం కుట్ర పన్నాయని, ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన మహిళలు గాయత్రీ కళాశాల ప్రధాన ద్వారం వద్ద కాపుకాశారని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది.












Click it and Unblock the Notifications