రఘువీరాపై చెప్పులు, రోడ్డు పైనే మంత్రి బైఠాయింపు

Raghuveera Reddy
అనంతపురం: మంత్రి రఘువీరా రెడ్డికి మంగళవారం సొంత జిల్లాలో చేదు అనుభవం ఎదురయింది. తెలుగుదేశం, వైయస్సార్సీ పార్టీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌పై చెప్పులు విసిరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతపురం జిల్లాలోని బుక్కపట్నంలో మంగళవారం రఘువీరా రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో తెలుగుదేశం, వైయస్సార్సీ పార్టీ కార్యకర్తలు, రైతులు ఆయనను అడ్డుకున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రఘువీరా కాన్వాయ్ ముందు బైఠాయించారు.

ఆయన కాన్వాయ్‌పై ఆందోళనకారులు చెప్పులు విసిరారు. దీంతో కాంగ్రెసు, టిడిపి, వైయస్సార్సీ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలుగజేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం మంత్రి రఘువీరా రెడ్డి రోడ్డుపై బైఠాయించడం కొసమెరుపు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+