హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముట్టడి, కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavitha
హైదరాబాద్: అసెంబ్లీని ముట్టడికి యత్నించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం నిజాం కళాశాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులపై పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ అమరవీరుల స్థూపం అయిన గన్ పార్కు వద్ద మానవహారం నిర్వహించారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం గన్ పార్కు నుండి అసెంబ్లీకి భారీ ర్యాలీగా చేరుకున్నారు. అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. అసెంబ్లీలోకి కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకున్నారు.

దీంతో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు కవితను అరెస్టు చేశారు. కాగా విద్యార్థులపై దాడిని నిరసిస్తూ పలువురు తెలంగాణ వాదులు సచివాలయానికి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి భారీ ర్యాలీతో వస్తున్న విద్యార్థులను పోలీసులు ఎన్సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. కాగా ఉద్యమం దృష్ట్యా అసెంబ్లీ, సచివాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం తదితర ప్రాంతాల్లో భారీగా భద్రతా దళాలను ఉంచారు.

English summary
Telangana Jagriti president Kalvakuntla Kavitha arrested by police today at Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X