3 ఇడియట్స్ సినిమా నాకెంత ఇష్టమో: చంద్రబాబు

రాజకీయాల్లో చేరుతామంటే ఎవరి తల్లిదండ్రులు కూడా అంగీకరించబోరని, రాజకీయాల్లో చేరవద్దని తమ నాన్న తనకు చెబుతూ ఉండేవారని ఆయన అన్నారు. నాన్న మాట విని ఉంటే తాను ఉద్యోగిగానో, అధికారిగానో మిగిలిపోయి ఉండేవాడినని, రాజకీయాల్లోకి రావడం వల్ల ప్రజా సేవ చేసే అవకాశం లభించిందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము 90 శాతం సీట్లు యువతకు కేటాయిస్తామని ఆయన చెప్పారు. ఏటా తన ఆస్తులను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను కొనసాగిస్తానని ఆయన చెప్పారు.
అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెసు పార్టీకి వచ్చే ఎన్నికల్ోల గుణపాఠం నేర్పాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు ఆయన నెల్లూరులో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. మద్దతు ధర విషయాన్ని గానీ ధర్మల్ పవర్ ప్రాజెక్టుల గురించి గానీ జిల్లా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications