భర్తలను వేధిస్తున్న భార్యలంటూ చిరంజీవి జోక్

Chiranjeevi
తిరుపతి: స్వయం సహాయక గ్రూపు మహిళ భార్యలపై భర్తల వేధింపుల గురించి వివరిస్తున్నప్పుడు కాంగ్రెసు శాసనసభ్యుడు చిరంజీవి ఓ జోక్ వేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్న సమావేశంలో మహిళలు ఒక్కరొక్కరే తాము పనిచేస్తున్న కార్యరంగాలపై వివరిస్తూ వెళ్లారు. ఈ సమావేశంలో చిరంజీవి కూడా పాల్గొన్నారు. భార్యలను భర్తలను వేధిస్తున్న సమస్యలను పరిష్కరిస్తున్న తీరుపై ఓ మహిళ వివరిస్తుండగా చిరంజీవి ఓ జోక్ చేశారు. భార్యలను భర్తలను వేధిస్తున్న ఫిర్యాదులు రావడం లేదా అని ఆయన అడిగారు.

చిరంజీవి మాటలు బయటకు వినిపించలేదు. అయితే, చిరంజీవి ఇలా అంటున్నారంటూ కిరణ్ కుమార్ రెడ్డి సభాముఖంగా చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి చిరంజీవి బుధవారం తిరుపతిలో పర్యటించారు. ఆయనతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుపతి శాసనసభ్యుడిగా ఆయన ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశాలాంధ్రకు కట్టుబడి ఉండాలని చిరంజీవి ఓ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణకు ఉచిత సలహా కూడా పారేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+