తెలంగాణ సమ్మె: బొత్స, కిరణ్ మధ్య తాజా చిచ్చు

ముఖ్యమంత్రితో మాట్లాడకుండానే తొలగించిన కాంట్రాక్టు కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు బొత్స సత్యనారాయణ చెప్పారు. తాము తొలగించిన 1300 మంది కాంట్రాక్టు కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరావు అధికారికంగా కూడా ప్రకటించారు. తెలంగాణ సమ్మె విషయంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డితో విభేదిస్తూ బొత్స సత్యనారాయణ మాట్లాడారు.
కాగా, ఆర్టీసి జెఎసి నేతలతో బొత్స సత్యనారాయణ చర్చలు విఫలమయ్యాయి. బస్సు భవన్‌కు వెళ్లి ఆయన ఆర్టీసి ఉద్యోగుల జెఎసి నాయకులతో మాట్లాడారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులను కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోని నేపథ్యంలో తాను పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకోవడానికి బొత్స జెఎసి నేతలతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. అయితే, సమ్మెను విరమించేందుకు ఆర్టీసి ఉద్యోగుల జెఎసి నేతలు నిరాకరించారు. కాగా, మెడికల్, పారామెడికల్ ఉద్యోగులు రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నారు. తమపై ఎస్మా ప్రయోగిస్తే అత్యవసర సేవలు కూడా మానేస్తామని వారు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications