మేమూ రాజీనామాలు చేస్తాం: కోమటిరెడ్డికి ఎర్రబెల్లి

కాంగ్రెసు ప్రజాప్రతినిధులు పదవులు పొంది తెలంగాణ మరిచారని విమర్శించారు. వచ్చే నెల 2వ తేదిన టిడిపి ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. తెలంగాణకు టిడిపి వ్యతిరేకం కాదన్నారు. కొందరు కుట్రపూరితంగా టిడిపి తెలంగాణకు వ్యతిరేకమన్న భావన ప్రజల్లో కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో మంత్రి కోమటిరెడ్డి తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయిస్తే తమ అధినేత చంద్రబాబు నాయుడుచే కేంద్రానికి లేఖను రాయిస్తామన్నారు.












Click it and Unblock the Notifications