విదేశాల్లో గాలి కంపెనీలు, భారీగా పెట్టుబడులు

విదేశాల్లో గిరాకీ ఉన్న సమయంలో తక్కువ ధరకు ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసి, తాను స్థాపించిన ఎజెన్సీల ద్వారానే అక్కడ ఎక్కువ ధరకు విక్రయించినట్లు చెబుతున్నారు. ఇందుకు గాను విదేశాల్లో స్థాపించిన ఏజెన్సీల్లో ఆయన భార్య, సన్నిహితులు కూడా భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. చైనా, సింగపూర్, వియత్నాం, దుబాయ్‌ల్లో ఈ ఏజెన్సీలను స్థాపించినట్లు తెలుస్తోంది. జిజెఆర్ (గాలి జనార్దన్ రెడ్డి) కంపెనీ పేరుతో ఇండోనేషియా, కంపూచియాల్లో పెద్ద యెత్తున గాలి జనార్దన్ రెడ్డి పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు. విదేశాల్లో ఆర్జించిన డబ్బులను హవాలా ద్వారా తిరిగి స్వదేశానికి మళ్లించినట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications