జగన్ సిఎం కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు: మేకపాటి

తాము రాజీనామాలు చేసి నెల రోజులైనా స్పీకరు తమ రాజీనామాలు ఎందుకు ఆమోదించడం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెసు ప్రభుత్వానికి చీము, నెత్తురు ఉంటే తమ రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేశారు. దొడ్డిదారిన ఇంఛార్జులను నియమించడం సరికాదన్నారు. రాజీనామాలు చేసిన శాసనసభ్యులెవరూ తిరిగి కాంగ్రెసులోకి వెళ్లరన్నారు. జగన్ జైలుకు వెళ్లక తప్పదన్న చంద్రబాబు వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూర్చోక తప్పదని మరో శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి కర్నూలులో అన్నారు.












Click it and Unblock the Notifications