కోమటిరెడ్డి బ్రదర్స్ మనసంతా జగన్‌పైనే: పాల్వాయి

Palwai Govardhan Reddy
హైదరాబాద్: నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరుల మనసంతా వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు లాగుతోందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బుధవారం అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులకు తెలంగాణ ముఖ్యమా? జగన్ ముఖ్యమా? తేల్చుకోవాలని సూచించారు. కోమటిరెడ్డి సోదరులకు తెలంగాణపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చుతున్న వారికి చెప్పుల దండ వేయాలని కోమటిరెడ్డి చెబుతున్నారని అదే నిజమైతే ఆయనకే ఇప్పటికి నాలుగైదు సార్లు వేయాల్సి ఉంటుందన్నారు.

గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన వారే ఇప్పుడు తామే ప్రధానమన్నట్టుగా ప్రవర్తించడం విడ్డూరమన్నారు. కాంగ్రెసు వాదం మొదటి నుండి తెలంగాణనే అన్నారు. కాంగ్రెసు తెలంగాణవాదం వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ పెట్టాడన్నారు. ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి కళ్లులేని కబోది అన్నారు. ఆమెను ఖమ్మంలో అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+