ప్రమాణం చేస్తావా: జగన్‌కు సిఎం రమేష్ సవాల్

YS Jagan
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు టెండర్ విషయంలో కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేసేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సిఎం రమేష్ సవాల్ చేశారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లను తమ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు ఇచ్చేందుకు ప్రభుత్వంతో కుమ్మక్కయినట్లు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తను ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రూ. 16 లక్షలకు టెండర్లు పిలిచారని, దానిలో తినీ తినీ అంతా అలానే జరుగుతోందని జగన్ అనుకుంటున్నారని ఆయన అన్నారు.

వైయస్ జగన్ తనతో పాటు సిబిఐ వద్దకు రావాలని, పోలవరం ప్రాజెక్టు టెండర్లపై విచారణ జరపాలని అడుగుతానని ఆయన చెప్పారు. వైయస్సార్ హయాంలో జరిగిన జలయజ్ఞం పనులపై విచారణ జరిపించాలని జగన్ సిబిఐని కోరాలని, అలా అడగకపోతే జలయజ్ఞంలో అవినీతి జరిగిందని అంగీకరించినట్లేనని ఆయన అన్నారు. సిబిఐ విచారణ మందగించడానికి జగన్ ఢిల్లీలో ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో తనకు తెలుసునని, దాన్ని త్వరలోనే బయటపెడతానని ఆయన అన్నారు. కేంద్రంతో జగన్ కుమ్మక్కయినా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+