తెలంగాణ కోసం: కోఠీలో టవరెక్కి యువకుడి హంగామా

తాను హోర్డింగ్ పైనే దీక్ష కొనసాగిస్తానన్నారు. ఎవరూ తన వద్దకు రావద్దని తెలంగాణ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయడానికి మాత్రమే తన వద్దకు రావాలని డిమాండ్ చేశారు. కాగా శ్రీనివాస్‌తో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి కోదండరాం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత గద్దర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తదితరులు హోర్డింగ్ దిగి రావాల్సిందిగా కోరారు. చర్చలతో పరిష్కారించుకుందామని విజ్ఞప్తి చేశారు. అయితే వారి విజ్ఞప్తిని శ్రీనివాస్ తోసి పుచ్చారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు రాజీనామా సమర్పిస్తే తాను రావడానికి సిద్ధమన్నారు.
ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి బుద్ది లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రాణాలు తమకు చాలా ముఖ్యమని ఆయన దీక్షకు కూర్చోకుండా ఉండటానికే తాను హోర్డింగ్ పైన దీక్షకు దిగానన్నారు. మన ఉద్యమం తీవ్రత కేంద్రానికి తాకాలన్నారు.












Click it and Unblock the Notifications