చంద్రబాబు రూటే సపరేటు, జిల్లా యాత్రలతో బిజీ

వచ్చే ఎన్నికలకు చంద్రబాబు ఇప్పుడే సిద్ధపడుతున్నట్లుగా కూడా అనిపిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో తన పర్యటనను ముగించుకున్నారు. నెల్లూరు జిల్లాలో మూడో రోజు పర్యటన జరుపుతున్నారు. కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఇలా జిల్లా పర్యటనలు వేసుకుంటూ పార్టీ జిల్లా నాయకులను, కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ, విద్యార్థులను ముఖాముఖి పేరిట తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను అవినీతి రహితుడనని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అవినీతిపై పోరాడే ఏకైక నాయకుడిగా ఆయన ముద్ర వేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో అన్నా హజారే కావాలనేది ఆయన ఎత్తుగడగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని, ఆ పార్టీకి మనుగడ లేదని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మనుగడ ఎంత కాలం ఉంటుందో కూడా ఆయన చెప్పేశారు. జగన్ పార్టీ మనుగడ 45 రోజులేనని ఆయన ఇటీవల ఈ కార్యక్రమంలో చెప్పారు. పార్టీ నాయకుల్లో మనోధైర్యం నింపడానికి ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఆయన తెలంగాణలో పర్యటించే అవకాశం మాత్రం లేకుండా పోయింది. తెలంగాణ విషయాన్ని ఆయన పూర్తిగా వదిలేసినట్లే కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications