కోదండరామ్ చెప్పినట్లు డ్యాన్సులు చేయబోం: సర్వే

తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు రాజీనామాలు చేయకపోతే డిస్మిస్ చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు ఫాక్స్ చేస్తే రాజీనామాలను అంగీకరిస్తారా అని ఆయన అడిగారు. సకల జనుల సమ్మెలో జనులు లేరని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయానికి సకల జనులతో సంబంధం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మ దిన కానుకగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడుతుందని ఆయన చెప్పారు. రాజీనామాలు, బ్లాక్ మెయిలింగ్‌లతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగదని ఆయన అన్నారు. సోనియా గాంధీ ఆరోగ్యం బాగా లేదని, అందువల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కోసం కొంత కాలం ఆగాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications