కిరణ్‌ను దింపేందుకు బొత్స యత్నం: కొండా సురేఖ

తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిన కాంగ్రెసు పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తారో లేదో తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జగన్‌కు, కాంగ్రెసు పార్టీలో తన పార్టీని విలీనం చేసిన చిరంజీవికి ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉందన్నారు. చిరంజీవి నైతిక విలువలు వదిలేసి కాంగ్రెసులో చేరితే జగన్ నైతిక విలువల కోసం కాంగ్రెసు వీడారన్నారు. వైయస్సార్సీ పార్టీ కాంగ్రెసులో కలిసి పోతుందన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కలలు నెరవేరవన్నారు.












Click it and Unblock the Notifications