జగన్ పార్టీ సలహాదారు సిసిరెడ్డిపై రెండో భార్య ఫిర్యాదు

అవసరమైతే తన పిల్లలు, తాను డిఎన్‌ఎ పరీక్షలకు సిద్దంగా ఉంటామని ఆమె చెప్పారు. సిసి రెడ్డి పేరు మీద, ఆయన భార్య సి. సుభద్ర పేరు మీద ఉన్న ఆస్తిలో తనకూ తన పిల్లలకూ వాటా ఇప్పించడంతో పాటు తనకు సామాజిక హోదా కల్పించాలని ఆమె కోరారు. అమెరికా పౌరురాలినైన తనను తన భార్యకు వీసా ఇప్పించడానికి వాడుకున్నాడని ఆమె ఆరోపించారు. కాగా, సిసి రెడ్డి ఎస్‌బిఐ న్యూయార్క్ శాఖ నుంచి ఐదు లక్షల డాలర్ల అప్పు తీసుకున్నాడని, దానికి తాను గ్యారంటీ ఇచ్చానని, సిసి రెడ్డి పరారీలో ఉండడంతో తాను ఆ అప్పును తాను తీర్చాల్సి వస్తోందని ఆమె వివరించారు.
సిసి రెడ్డిగా పేరు మోసిన చవ్వా చంద్రశేఖర రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వైయస్ జగన్ పార్టీకి సలహాదారుగా ఉన్నారు. సిసి రెడ్డి విషు కన్సల్టెన్స్ పేరు మీద ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సర్వీసును నడుపుతున్నారు. సిసి రెడ్డి వైయస్సార్ కుటుంబానికి సన్నిహిత బంధువు కూడా.












Click it and Unblock the Notifications