తెలంగాణ సమ్మె, నరసింహన్‌తో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

విధులకు హాజరవుతున్న ఉద్యోగులకు మాత్రమే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి ఈ నెల 29వ తేదీననే వేతనాలు చెల్లిస్తారు. కాగా, రెండు రోజుల పాటు రైలో రోకో, ఆటో బంద్ కార్యక్రమాలు జరగనున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి రైల్ రోకో జరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది.
కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నారు. కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపవద్దని పరోక్షంగా చెబుతూ వాస్తవాలతో కూడిన నివేదికను పంపాలని వారు కోరారు. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డికి, తెలంగాణ పార్లమెంటు సభ్యులకు మధ్య గురువారం రాత్రి మాటల యుద్ధం చోటు చేసుకుంది. తమ పార్టీ నాయకుల నుంచే ఒత్తిడి పెరుగుతుండడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications