మంత్రులపై నాగం, కెసిఆర్‌పై దేవేందర్ గౌడ్ ధ్వజం

మరోవైపు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై గౌడ సంఘ సమావేశంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణవ్యాప్తంగా సకల జనుల సమ్మెకు మద్దతుగా టిడిపి చేపట్టిన దీక్షలపై దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. తెలంగాణ పోరుకు మద్దతు ఇస్తున్న వారిపై దాడులు చేయడమేమిటని ప్రశ్నించారు. కెసిఆర్ అత్యంత ప్రమాదకారి అని, ఆయన ఓ విష పురుగు అని విమర్శించారు. ఆయన పట్ల తెలంగాణ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇక నుండి టిడిపి నేతలం గ్రామాల్లో పర్యటిద్దాం, ఎవరు అడ్డుకుంటారో చూద్దామన్నారు.












Click it and Unblock the Notifications