తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలపై గుడ్లు, రాళ్లతో దాడి

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ సెంటిమెంటును అడ్డం పెట్టుకొని తెలుగుదేశం ప్రజాప్రతినిధులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిని ప్రజలంతా గమనించాలని విజ్ఞప్తి చేశారు. సకల జనుల సమ్మెకు మద్దతుగానే తాము దీక్ష చేస్తున్నామని అలాంటప్పుడు తమ దీక్షను ఎలా అడ్డుకుంటాన్నారు. భౌతిక దాడులు ఎంత వరకు సమంజసమన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ దాడులను ఖండించాలన్నారు. జెఏసిని తొత్తుగా మార్చుకొని కెసిఆర్ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. టిడిని దెబ్బతీయడానికే భౌతిక దాడులన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల శాసనసభ్యుడు చంద్రశేఖర రావుపైన తెలంగాణవాదులు రాళ్లు, గుడ్లతో దాడి చేశారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి, టిఆర్ఎస్ మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. అదిలాబాదు పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ దీక్షలో సైతం తెలంగాణవాదులు దూసుకెళ్లి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. హన్మకొండలో టిడిపి దీక్ష శిబిరంలోకి టిఆర్ఎస్ కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఇక మరో ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులును తెలంగాణవాదులు జనగామ దగ్గర్లోని నెల్లుట్లలో అడ్డుకున్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications