ముఖ్యమంత్రిపై మరోసారి ఎగిరిపడ్డ శంకర్ రావు

కీలక నిర్ణయాలను తీసుకునే సమయంలో మంత్రులను సంప్రదించాల్సి ఉంటుందన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి సైతం ఆ విషయం తెలియదన్నారు. ఈ అంశాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకు వెళ్లేందుకు లేఖ రాసినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. మల్కాజిగిరి శాసనసభ్యుడు సర్వే సత్యనారాయణ ఏం సేవ చేశారని ఆయన ప్రశ్నించారు. కాగా ముఖ్యమంత్రి రూ.1 కిలో బియ్యం ఆ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు కూడా తెలియకుండా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో శ్రీధర్ బాబు అలగడం మరో మంత్రి రఘువీరా రెడ్డి ఆయనను బుజ్జగించడం కూడా జరిగింది.












Click it and Unblock the Notifications