చిరు హిట్ సిఎం ఫట్, ఓదార్పు చేపట్టాలి: అంబటి

పార్టీని హోల్ సేల్‌గా చిరంజీవి అమ్మి నమ్మిన వారిని ముంచారన్నారు. కాంగ్రెసులో చిరంజీవి హిట్ అయితే కిరణ్ ఫట్ అవుతారన్నారు. బొత్స సత్యనారాయణ ఏ స్థాయి నుండి వచ్చారో తెలుసుకోవాలన్నారు. గతంలో జగన్‌కు మద్దతు ఇవ్వాలని చిరంజీవిని ఎవరు అడిగారో ఆ పేర్లు బయటకు చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. చిరుకు ఇప్పుడు నచ్చిన కాంగ్రెసు పీఆర్పీ పెట్టినప్పుడు నచ్చలేదా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏడాది సమయం అడుగుతున్నారని ఆయన ఆ సమయం ఎవరిని అడుగుతున్నారని ప్రశ్నించారు. పీఠంపై అభద్రతా భావంతో ఆయన మాట్లాడుతున్నారన్నారు. పదవి గండం ఉందనే భయం ఆయనలో కనిపిస్తోందన్నారు. 104, 108 ఉద్యోగులను కాపాడి తర్వాత ముఖ్యమంత్రి లక్షల ఉద్యోగాలు ఇస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications