తెలంగాణపై ఎట్టకేలకు నోరు విప్పిన చంద్రబాబు

తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తాము నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ శానససభా నియోజకవర్గంలో తమ పార్టీ పోటీ చేయడం లేదని ఆయన చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న సమయంలో అనిశ్చితి చోటు చేసుకుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నది తమ పార్టీ ఒక్కటేనని ఆయన అన్నారు. తమ పార్టీని దెబ్బ తీయాలని కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కుట్ర చేస్తున్నాయని, అది ఎన్నిటికీ జరగదని ఆయన అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications