సీమాంధ్ర బస్సులను అడ్డుకుంటాం: కోదండరామ్

ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ బంద్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 29వ తేదీన ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి ఉంటుందని ఆయన చెప్పారు. వచ్చే నెల 9,10,11 తేదీల్లో తిరిగి రైల్ రోకో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. వచ్చే నెల 1వ తేదీన కాగడాల ప్రదర్శన ఉంటుందని ఆయన చెప్పారు. 2వ తేదీన టోల్ గేట్ల వద్ద ప్రదర్శన నిర్వహిస్తామని ఆయన అన్నారు. బతుకమ్మ, దసరా పండుగలను తెలంగాణకు అంకితమిస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్టోబర్ 3 నుంచి 6వ తేదీ వరకు తెలంగాణపై దసరా పండుగ సందర్భంగా తెలంగాణ భావవ్యాప్తి జరుగుతుందని ఆయన అన్నారు. 6వ తేదీన దశకంఠ దహనం జరుగుతుందని, జమ్మిచెట్ల వద్ద ప్రదర్శనలుంటాయని ఆయన అన్నారు.
వ్యవసాయానికి విద్యుత్తు కోత విధించడంపై కెసిఆర్ మండిపడ్డారు. రైతులను ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ఇటువంటి విద్యుత్ కోత చరిత్రలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. జలవిద్యుదుత్పత్తిని నిర్లక్ష్యం చేస్తున్నారని, వెంటనే శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తి చేపట్టాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ముక్కు పిండి కాంగ్రెసు నేతలు రైతులకు విద్యుత్తు సరఫరా చేయించాలని ఆయన అన్నారు. విద్యుత్తు సౌధ వద్ద ధర్నా చేస్తున్న మంత్రి కోమటిరెడ్డిని అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మంత్రిని కూడా జైల్లో పెడతారా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications