మరోసారి దీక్షకు సిద్ధమైన జగన్: 1న బెజవాడలో..

YS Jagan
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు దీక్షకు సిద్ధమయ్యారు. గత నెల రోజులకు పైగా కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న వైయస్ జగన్ ఆదివారం తాను దీక్షకు దిగనున్నట్ల శనివారం ప్రకటించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంట విరామం ప్రకటించి ప్రభుత్వంపై ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా అక్టోబర్ 1వ తారీఖున తాను విజయవాడలో దీక్ష చేస్తానని చెప్పారు. ఆదివారం రాత్రి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు గ్రామంలో జరిగిన సభలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు.

రాష్ట్రంలో పరిపాలిస్తున్న కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తనకు ఏ మాత్రం లేదని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన సోదర, సోదరీమణుల కుటుంబాలను ఓదార్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రాజకీయాల్లో కుళ్లు, కుతంత్రం లేకుండా విశ్వసనీయతకు నిదర్శనంగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని ఆయన కష్టపడి రెండోసారి అధికారంలోకి తెచ్చిన ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తనకు లేదన్నారు. కాగా ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా దీక్షలు చేపడుతున్నారు. గతంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్సు మెంట్స్ ఇవ్వాలని హైదరాబాదులో ఫీజు పోరు, న్యూఢిల్లీలో జలదీక్ష, విజయవాడలో లక్ష్యదీక్ష తదితర దీక్షలు చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+