రోజూ రాత్రి పూట చపాతీ తినటం మంచిదేనా..!?
ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఆరోగ్యం కోసం చాలా మంది తెల్ల అన్నంకు దూరం అవుతున్నారు. డయాబెటిక్ సమస్యలు ఉన్నవారు పుల్కా, చపాతీ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాత్రి సమయంలో చపాతీ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అధిక బరువుతో నియంత్రణతో పాటుగా అనేక ఆరోగ్య సమస్యలకు చపాతీ ఆహారం మేలు చేస్తుంది. ఇదే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవా ల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
చపాతీలు రాత్రి పూట తీసుకునే వారి చాలా మంది కనిపిస్తారు. రాత్రిపూట చపాతీ తినడం వల్ల కొన్ని పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, చపాతీలు సాధారణంగా గోధుమపిండితో తయారు చేస్తారు. ఇందులో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియకు సహాయపడు తుందని, మలబద్ధకాన్ని నివారిస్తుందని, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో బి1, బి2, బి3, బి6, బి9, ఇ విటమిన్లతో పాటు ఐరన్, కాపర్, మాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, అయోడిన్, జింక్, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయని పేర్కొంటున్నారు. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని పేర్కొంటున్నారు. చపాతీలు రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయని, డయాబెటిస్తో బాధపడుతున్న వారికి లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించా లనుకునే వారికి మంచిదని చెబుతున్నారు.

నిపుణుల సూచనలు
కాగా, చపాతీల్లో ఉండే బి విటమిన్లు, జింక్, ఇతర ఖనిజాలు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహకరిస్తాయి. చపాతీలు గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే..చపాతీ ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువ నూనె, నెయ్యితో చేసుకోవడం వల్ల బాడీలో అనవసర కొవ్వులు చేరతాయని నిపుణులు చెబుతున్నారు. పుల్కా చేసుకొని తింటే మరీ మంచిదని పేర్కొంటున్నారు. మార్కెట్లో దొరికే పిండిలో మైదా కూడా కలిసి ఉంటుందని, కాబట్టి ముడి గోధుమ లు తీసుకొని స్వయంగా పట్టించుకొని ఆ పిండితో చపాతీ చేసుకుంటే మంచిది. చపాతీ లో కాంబినే షన్ కోసం పప్పు.. బంగాళాదుంప కర్రీ అని కాకుండా అన్ని రకాల కాయగూరలతో చేసిన కూరలు తీసుకోవడం వల్ల పోషకాలన్నీ శరీరానికి అందుతాయని సూచిస్తున్నారు. ఈ క్రమంలో క్యారెట్ ముక్కలు, బీన్స్, పాలకూర వంటి వాటిని ఉడికించి, గోధుమ పిండి కలుపుకొని చపాతీలు చేసు కుంటే అటు రుచికి, ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం.













Click it and Unblock the Notifications