లగడపాటికి కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు కౌంటర్

తమ పార్టీ అధిష్టానం తెలంగాణపై ప్రకటన చేస్తుందని భావిస్తున్న తరుణంలో లగడపాటి రాజగోపాల్ దురుద్దేశంతో వ్యవహరించారని ఆయన అన్నారు. తెలంగాణకు అడ్డుపడాలని లగడపాటి రాజగోపాల్ అనుకుంటే తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. సామరస్యంగా విడిపోయి కలిసి ఉందామని భావిస్తుంటే లగడపాటి రెచ్చగొట్టే విధంగా ఎందుకు ప్రకటనలు చేస్తున్నారని ఆయన అడిగారు. ఇలాగే వ్యవహరిస్తే గతంలో పట్టిన గతే లగడపాటికి పడుతుందని ఆయన అన్నారు. హింసను ప్రేరేపించి తెలంగాణను అడ్డుకోవాలని లగడపాటి ప్రయత్నిస్తున్నారని వారు విమర్శించారు. లగడపాటి రాజగోపాల్ పెద్ద నాయకుడి ఫోజు కొడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఆఫ్టరాల్ లగడపాటి రాజగోపాల్ ఓ పార్లమెంటు సభ్యుడని, దాన్ని మరిచిపోయి తానే అధిష్టానంలోని నాయకుడిగా మాట్లాడుతున్నారని మరో పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. రాష్ట్ర విభజన ఖాయం కాబోతోందని, తాను విజయవాడకో విశాఖపట్నానికో వెళ్లేది లేదని, లగడపాటి రాజగోపాల్ హైదరాబాదులో ఉండాల్సి వస్తుందని, అందువల్ల లగడపాటి జాగ్రత్తగా మాట్లాడాలని, సామరస్య వాతావరణం చెడగొట్టే విధంగా వ్యవహరించడం మంచిది కాదని ఆయన అన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెసు ఇతర పార్లమెంటు సభ్యులతో పాటు కొంత మంది పార్టీ తెలంగాణ శాసనసభ్యులు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications