మొండికేయడంతో లగడపాటి కారును లాక్కెళ్లిన క్రేన్

Lagadapati Rajagopal
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మంగళవారం జూబ్లీహిల్సు పోలీసు స్టేషన్ నుండి ఇంటికి వెళ్లడానికి మొండికేశారు. సుమారు గంట సేపు లగడపాటి పిఎస్ ముందు తన కారులో కూర్చున్నారు. పోలీసులు చాలాసేపు వెళ్లి పోవాలని నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. లగడపాటి ససేమీరా అనడంతో చేసేది లేక ఆయన కారులో ఉండగానే క్రేన్ సహాయంతో ఆయన కారును పిఎస్ ముందు నుండి ఆయన ఇంటికి తరలించారు. కారును తరలిస్తుండగా తెలంగాణవాదులు ఆయన కారుపై రాళ్లతో దాడి చేశారు. అంతకుముందు ఆయన ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. సోమవారం తెలంగాణవాదులు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి అసిస్టెంట్ కమిషనర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో లగడపాటి దాడికి గురైన సీమాంధ్ర ఉద్యోగులను పరామర్శించడానికి వెళ్లారు.

ఆ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ తదితరులు అక్కడకు వచ్చారు. లగడపాటిని కార్యాలయంలోనికి రానివ్వడాన్ని వారు ప్రశ్నించారు. లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. లగడపాటికి రెడ్ కార్పెట్ పరిచిన అధికారులు తమను ఎందుకు లోనికి అనుమతించడం లేదని వారు ఈ సందర్భంగా అధికారులను ప్రశ్నించారు. అయితే అప్పటికే లగడపాటిని అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురు తెలంగాణ న్యాయవాదులు పిఎస్ చేరుకొని లగడపాటికి వ్యతిరేకంగా, తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని వారించే ప్రయత్నాలు చేసినప్పటికీ వారు తమ ఆందోళన విరమించలేదు. ఉద్రిక్త పరిస్థితుల మధ్యనే లగడపాటిని పోలీసులు విడుదల చేశారు.

లగడపాటి మాత్రం తాను ఇంటికి వెళ్లేది లేదని పిఎస్‌లోనే బైఠాయించారు. తనను అకారణంగా ఎందుకు అరెస్టు చేశారో పోలీసులు చెప్పాలంటూ వారిని నిలదీశారు. అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా పిఎస్ ముందు ఆందోళన చేస్తున్న తెలంగాణవాదులతో తనకు చర్చించడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను డిమాండ్ చేశారు. వారితో చర్చించే వరకు తాను ఇంటికి వెళ్లేది లేదన్నారు. పోలీసు స్టేషన్ ముందు ఉన్న తన కారులోనే బైఠాయించారు. అతనిని అక్కడి నుండి పంపించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. లగడపాటిని అక్కడి నుండి వెళ్లాల్సిందిగా పోలీసులు బుజ్జగించారు. అయితే చేసేది లేక ఆయన కారును క్రేన్‌తో తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+