పోలీసులతో తోపులాట, కిందపడిన హరీష్, చినిగిన చొక్కా

అనంతరం పోలీసులు హరీష్ రావును, విష్ణును, ఈశ్వర్, మధుయాష్కీని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లగడపాటికి ఎంత దమ్ముంటే ఉద్యమం జరుగుతున్న సమయంలో ఇక్కడకు వచ్చి తెలంగాణవాదులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారని ప్రశ్నించారు. లగడపాటికి రెడ్ కార్పెట్ పరిచిన అధికారులు తమను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. లగడపాటి దీక్ష వల్లనే తెలంగాణ రాష్ట్రం ఆగిపోయిందని ఆరోపించారు. పోలీసు తీరుపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లగడపాటికి రెడ్ కార్పెట్ పరిచిన పోలీసులు తమపై దౌర్జన్యానికి పూనుకున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ను బూటు కాళ్లతో తన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications