అసెంబ్లీ తొలిరోజే ప్రభుత్వంపై అవిశ్వాసం: సోమిరెడ్డి

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్: శాసనసభ సమావేశాల తొలిరోజే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. శానససభ సమావేశంలో ఎప్పుడు జరిగినా సమావేశాల తొలిరోజే అవిశ్వాసం ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న వ్యాఖ్యపై ప్రస్తావించగా ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ వివరణ ఇచ్చారు. వైయస్ జగన్ మాటలకు విలువ లేదని ఆయన అన్నారు. జదగన్ మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు చేస్తామని బస్సు యాత్ర ఏమైందని ఆయన అడిగారు.

కిరణ్ కుమార్ రెడ్డి సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప ఏమీ చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పాలించడం చేతగాకపోతే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు పడుతున్న ఇక్కట్లు, కష్టాలు దేవుడికే తెలుసునని ఆయన అన్నారు. తాము ప్రాంతీయ ఉద్యమాలను గౌరవిస్తున్నామని, అయితే దానికి కొన్ని పరిమితులు, పద్ధతులు ఉంటాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+