జగడమే: కెసిఆర్‌తో యుద్ధానికి సిద్ధమౌతున్న టిటిడిపి

టిఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి వారు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ముసుగులో కెసిఆర్ రాజకీయం చేస్తున్నారని కేంద్రంపై ఒత్తిడి తెచ్చే భాగంలో ఉప ఎన్నికలను బహిష్కరిద్దామనే తమ సూచనను కెసిఆర్ బేఖాతరు చేశారని తెలంగాణ పేరుతో తన సీట్లు పెంచుకోవాలని చూస్తున్నారనే భావనను ప్రజల్లోకి గట్టిగా తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కెసిఆర్‌కు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే బాన్సువాడ ఉప ఎన్నికలు బహిష్కరించడంతో పాటు రాజ్యాంగ సంక్షోభం కోసం తమతో కలిసి రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేయకూడదనే తమ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అలాకాకుండా రాజీనామాలు చేసి తిరిగి పోటీ చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదని పోటీ చేయకుండా ఉంటేనే కేంద్రంపై ఒత్తిడి వస్తుందనే భావనను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ ఇచ్చే పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెసుతో కలిసి టిఆర్ఎస్ ముందుకు వెళ్లడాన్ని సైతం ప్రజల ముందుకు తీసుకు వెళ్లాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోటిడిపిని నిర్వీర్యం చేయడానికే కాంగ్రెసుతో కెసిఆర్ వెళుతున్నాడు తప్ప తెలంగాణపై చిత్తశుద్ధితో కాదనే అస్త్రంతో ముందుకు రానున్నారు. ఇక ఇటీవల తమ దీక్షలపై జరిగిన దాడిని నిరసిస్తూ మరోసారి ఇలాంటివి జరిగితే తాము అదే స్థాయిలో స్పందించాల్సి వస్తుందని టిఆర్ఎస్‌ను హెచ్చరించే ప్రయత్నాలు వారు చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఐకాస చైర్మన్ కోదండరామ్‌నూ టార్గెట్ చేసుకోనుంది. కెసిఆర్ రాజకీయం కోసమే ఉద్యమిస్తున్నాడని ప్రజలకు చెప్పేందుకు ఆయన గతంలో చేసిన పలు కామెంట్లను టిటిడిపి చెక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications