తెలంగాణ రాకూడదనే అలా...: కెసిఆర్‌పై విహెచ్

V Hanumanth Rao
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్య పరిష్కారమైతే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు పని ఉండదు. కాబట్టే ఆ సమస్యను పొడిగించాలనే ఆయన కోరుకుంటాడని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. తెలంగాణలో నాయకత్వం కోల్పోకుండా కేసీఆరే లాభం పొందుతున్నాడని, అయితే ప్రజల్ని ఇబ్బందులు పెట్టకుండా తెలంగాణ సాధించుకోవాలన్నది తమ ఉద్దేశం అని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్లకుండా రాజీనామాలు చేయాలన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని వీహెచ్ తోసిపుచ్చారు.

తెలంగాణ ఏర్పాటు అవసరం లేదనీ ఉద్యమం ఇలాగే కొనసాగించాలనుకున్న వారే అలా మాట్లాడతారని ఆయన కెసిఆర్‌ను తప్పు పట్టారు. రాజీనామాలు వద్దని తాము ముందు నుంచీ చెబుతున్నామని, ఆయన రాజీనామాలు చేసిన ప్రతిసారీ మెజార్టీ తగ్గిందే తప్ప పెరగలేదని అన్నారు. కేసీఆర్‌తో పాటు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసినా కేంద్రంలో స్పందన లేదని గుర్తు చేశారు. కాబట్టే ప్రజలు, ఉద్యోగులంతా సకల జనుల సమ్మెకు దిగారని చెప్పారు. దీంతో తెలంగాణ మొత్తం స్తంభించిపోయిందని అన్నారు.

రాజీనామాల వల్ల ఎన్నికలు జరగటం తప్ప తెలంగాణ ఏర్పాటు కాదని చెప్పారు. తెలంగాణలో నాయకుల ఉద్యమమే తప్ప ప్రజల ఉద్యమం లేదని సీమాంధ్ర నాయకులు అన్నారని, ఇప్పుడు ప్రజలే ఉద్యమం చేస్తున్నారని తాము అధిష్ఠానానికి వివరిస్తామని అన్నారు. తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని అధిష్ఠానాన్ని కోరతామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+