లగడపాటి రాజగోపాల్ అరెస్టు, ఆందోళనతో ఉద్రిక్తం

సీమాంధ్ర ఉద్యోగులపై దాడి చేసిన వ్యక్తి అందరికీ తెలుసునని అయినా ఇప్పటికీ ఆయనను అరెస్టు చేయక పోవడం శోచనీయమని అన్నారు. ఉద్యోగులపై దాడి జరిగిందని తెలుసుకొని వారిని పరామర్శించేందుకు ఒంటరిగానే వెళ్లానని చెప్పారు. ప్రజాప్రతినిధులు రౌడీలతో ఆందోళన చేయడం సరికాదన్నారు. సకల జనుల సమ్మె సకల కష్టాల సమ్మెగా మారిందన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే సమ్మె మంచి పద్ధతి కాదన్నారు. ఉద్యోగిపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అమాయకులైన అధికారులపై చేయి చేసుకోవడం సరికాదన్నారు. ఉద్యోగుల్లో ప్రాంతీయ విభేదాలు ఉండవద్దన్నారు.
కాగా, జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ వద్ద లగడపాటిని అడ్డుకోవడానికి తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డగించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లగడపాటి రాజగోపాల్‌కు వ్యతిరేకంగా న్యాయవాదులు నినాదాలు చేశారు. న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.












Click it and Unblock the Notifications