సోనియా కోర్టులో తెలంగాణ బంతి, నివేదికతో ఆజాద్

sonia Gandhi
న్యూఢిల్లీ: రెండు, మూడు రోజుల్లో తెలంగాణ బంతి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కోర్టులోకి పడనుంది. ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివేదిక అందిస్తానని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది సోనియానే అని ఆజాద్ తెలంగాణ కాంగ్రెసు నేతలకు చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ నేతలతో ఆయన బుధవారం సాయంత్రం రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఆజాద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీపరంగా తన సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిందని, సమగ్ర నివేదికను సోనియాకు, మన్మోహన్‌కు అందజేస్తానని ఆయన చెప్పారు. తన నివేదిక తర్వాత కూడా జాతీయ స్థాయిలో మరిన్ని సంప్రదింపులు అవసరం కావచ్చునని ఆయన అన్నారు.

2009 డిసెంబర్ 9వ తేదీ ప్రకటనకు ముందు ఇలాంటి సంప్రదింపులు జరగకపోవడం వల్లనే సమస్య తలెత్తిందని, తాము సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికే చూస్తున్నామని, ఈసారి సమస్య కావచ్చునని ఆయన అన్నారు. తాను నివేదిక సమర్పించిన తర్వాత అందరితోనో, ప్రతిపక్షాలతోనో, జాతీయ పార్టీలతోనో సంప్రదింపులు జరపాలా, వద్దా అనే విషయంపై సోనియా నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. తెలంగాణపై తాము తీసుకుని నిర్ణయానికి యుపిఎ భాగస్వామ్య పక్షాలు అంగీకరిస్తాయని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణలో పరిస్థితి తనకు తెలుసునని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపిస్తానని, సకల జనుల సమ్మెపై మాట్లాడుతానని, లగడపాటి వ్యవహారంపై కూడా చర్చిస్తానని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణపై సానుకూల ప్రకటన వచ్చే వరకు ఢిల్లీలోనే ఉంటామని, ఇదే తమ ఆఖరి సమావేశమని ఆజాద్‌తో భేటీ అనంతరం రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చెప్పారు. రేపు తెలంగాణపై సోనియాకు నివేదిక ఇవ్వాలని తాము ఆజాద్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఇచ్చేదీ తెచ్చేదీ తామేనని చెబుతూ వచ్చామని, ఇప్పుడు ఉత్త చేతులతో హైదరాబాదు వెళ్లలేమని ఆజాద్‌తో చెప్పినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెసు తెలంగాణ నేతలు ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+