ఏపీ మీదుగా తమిళనాడు వైపు ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు: బుకింగ్ ఓపెన్
వివిధ నగరాల మధ్య నెలకొంటోన్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. తరచూ వేర్వేరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను తరచూ ప్రకటిస్తూ వస్తోన్నారు. తాకిడికి అనుగుణంగా గతంలో ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లను కూడా పొడిగిస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు అవన్నీ కూడా. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉంటోన్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మరో ప్రత్యేక రైలును ప్రకటించారు రైల్వే అధికారులు. మలయాళీలు జరుపుకొనే ఓనం పండగను పురస్కరించుకుని ఈ రైలును నడిపించనున్నారు. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే ఎక్స్ ప్రెస్ ఇది. ఈ నెల 19వ తేదీన పట్టాలెక్కుబోతోంది. ఇది మల్టీ ట్రిప్ ఎక్స్ ప్రెస్. సెప్టెంబర్ 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఏపీ నుంచి తమిళనాడు, కేరళకు వెళ్లే వారికి ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ నెల 19, 26, సెప్టెంబర్ 2వ తేదీల్లో ప్రతి బుధవారం ఉదయం 11:35 నిమిషాలకు సంబాల్ పూర్ నుంచి బయలుదేరే నంబర్ 08311 ప్రత్యేక రైలు రెండో రోజు తెల్లవారు జామున 5:40 నిమిషాలకు ఎర్నాకుళానికి చేరుకుంటుంది.
ఈ నెల 21, 28, సెప్టెంబర్ 4వ తేదీల్లో ప్రతి శుక్రవారం ఉదయం 8:40 నిమిషాలకు ఎర్నాకులం నుంచి బయలుదేరే నంబర్ 08312 ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 11:15 నిమిషాలకు సంబాల్ పూర్ కు చేరుకుంటుంది.
బార్ గఢ్ రోడ్, బాలంగిర్, టిట్లాగఢ్, కేసింగ, మునీగూడ, రాయగఢ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాలపల్లి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూరు, కాట్పాడి, జోలార్ పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూరు, పాలక్కాడ్, త్రిశూర్, ఆలువ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ ఎక్స్ ప్రెస్ కు ఈ ఉదయం 8 గంటలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఆరంభం అయ్యాయి.



Click it and Unblock the Notifications