బెంగళూరులో నడిరోడ్డుపై లగ్జరీ ఆడి కారులో మృతదేహం: సీసీటీవీ ఫుటేజీలో.. !!

బెంగళూరులో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ లగ్జరీ ఆడి కారులో వ్యక్తి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనంగా మారింది. కారు డ్రైవింగ్ సీట్ లోనే విగతజీవిగా పడి ఉండటం కనిపించింది. ఇది.. పలు అనుమానాలకు తావిచ్చింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అతి కష్టం మీద కారు డోర్ ఓపెన్ చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు.

మృతుడిని కొడగు జిల్లాకు చెందిన సలీం అక్బర్ గా గుర్తించారు. ఎలా మరణించాడనేది ఇంకా తెలియరావట్లేదు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ అందిన తర్వాతే ఆయన మరణానికి గల కారణం తెలుస్తుందని కోరమంగళ పోలీసులు వెల్లడించారు. గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తోన్నారు. కారు కదలికలకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా తెలుసుకుంటోన్నారు.

Man Found Dead Inside Luxury Car Audi in Bengaluru Koramangala Identified as a native of Kodagu

పోలీసుల కథనం ప్రకారం.. కేఏ 51 ఎంజీ 9786 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన తెల్లరంగు ఆడి కార్ అర్ధరాత్రి దాటాక సుమారు 2:30 గంటల ప్రాంతంలో కోరమಂగళ 8వ బ్లాక్ లో గల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ వద్దకు వచ్చి ఆగింది. తెల్లవారినప్పటికీ కారు అక్కడి నుంచి కదల్లేదు. కాలం గడుస్తున్నప్పటికీ.. అదే స్థలంలో ఉండిపోయింది. దీంతో హోటల్ సిబ్బందికి అనుమానం తలెత్తింది. కారు లోపల డ్రైవింగ్ సీట్ లో నిద్రిస్తున్నట్లు ఉన్న అక్బర్ ను లేపడానికి దుకు అద్దాలపై తట్టి శతవిధాలా ప్రయత్నించారు.

రష్యాపై కనీవినీ ఎరుగని భారీ దాడి: మాస్కోలో సైతం.. !!
రష్యాపై కనీవినీ ఎరుగని భారీ దాడి: మాస్కోలో సైతం.. !!

లోపలి వ్యక్తి నుంచి ఎలాంటి కదలికలు లేకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే కోరమంగల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు తలుపులు తెరిచి చూడగా అక్బర్ అప్పటికే అతను మరణించినట్లు తేలింది. వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులతో పాటు సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్స్ టీమ్ ను పిలిపించి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

క్వీన్ ఆఫ్ క్రికెట్: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
క్వీన్ ఆఫ్ క్రికెట్: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

రాత్రి వేళ కారు నడుపుతుండగా గుండె నొప్పి రావడంతో వాహనాన్ని పక్కకు ఆపి ఉండొచ్చని, ఆ సమయంలోనే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తోన్నారు. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా బెంగళూరు పోలీసులు అక్బర్ కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+