Raghurama: రఘురామ కృష్ణ రాజా మజాకా ? లోకేష్ చెప్పినా నో..!

ఏపీలో డిప్యూటీ స్పీకర్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు (Raghurama Krishna Raju) రూటే వేరు. సంక్రాంతికి కోడి పందాల దగ్గరి నుంచీ సంప్రదాయ పంచె కట్టు వరకూ రఘురామ ఏం చేసినా బ్రాండ్ లాగే ఉంటుంది. అందుకే ఆయనకు అభిమానులు కూడా అదే స్ధాయిలో ఉంటారు. అయితే ఓ కీలక అంశంలో రఘురామకృష్ణ రాజు మరోసారి తన మార్క్ చూపించారు. రాష్ట్రంలో గణేశ్ నిమజ్జనాల సందర్భంగా వాడుతున్న డీజేల విషయంలో రఘురామ కీలక నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు ఆదేశాలూ బేఖాతర్ ? ఈసారి రెవెన్యూ మంత్రికి షాక్..!
చంద్రబాబు ఆదేశాలూ బేఖాతర్ ? ఈసారి రెవెన్యూ మంత్రికి షాక్..!

పశ్చిమ గోదావరి జిల్లాలోని తన నియోజకవర్గం ఉండిలో గణేశ్ నిమజ్జనాల కోసం అనుమతి కావాలంటూ స్ధానిక ఉత్సవ నిర్వాహకులు రఘురామ రాజును కలిశారు. అయితే వారికి డీజే అనుమతులు ఇచ్చేది లేదని తేల్చిచెప్పేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ వార్తా పత్రికలో వచ్చిన డీజే సౌండ్స్ కు ఆగిన గుండె కథనాన్ని వారికి చూపించడమే కాకుండా, వారితో చదివించారట. దీంతో షాకైన నిర్వాహకులు.. డీజే సౌండ్స్ లేకుండా వినాయక చవితి నిమజ్జనం చేసుకుంటామని ఎమ్మెల్యేకు చెప్పేశారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన రఘురామ.. డీజే సౌండ్స్‌కు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, కాబట్టి ధ్వని కాలుష్యం లేకుండా నిమజ్జనాలు చేసుకోవాలని వారికి సూచించి పంపేశారు.

Raghurama Krishna Raju Denied DJ Permission for Ganesh Immersion in Undi Despite Nara Lokesh s Statewide Nod
ఆ చీకటి రోజుల్ని గుర్తుచేసుకున్న లోకేష్..! ఇవాళ్టికి మూడేళ్లు..!
ఆ చీకటి రోజుల్ని గుర్తుచేసుకున్న లోకేష్..! ఇవాళ్టికి మూడేళ్లు..!

రఘురామ రాజు తీసుకున్న నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో భారీ ఎత్తిన జరిగే గణేశ్ నిమజ్జనాలకే డీజేలు వాడకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కానీ ఏపీలో మాత్రం హోంమంత్రి అనిత ఆదేశాలతో పోలీసులు ముందు ఆంక్షలు విధించినా, మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని ఆ ఆదేశాలను తీసేయించారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా డీజే శబ్దాల మోతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో రఘురామ తీసుకున్న నిర్ణయాన్న పలువురు ప్రశంసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+