జగన్‌కు చిప్పకూడు తప్పదు: టిడిపి నేత దేవినేని ఉమ

Devineni Uma Maheswara Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు చిప్పకూడా తప్పదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. హైదరాబాదు వస్తే అరెస్టు చేస్తారనే భయంతో జగన్ కృష్ణా జిల్లాలో తిరుగుతున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే జగన్‌కు పడుతుందని ఆయన అన్నారు. దసరా తర్వాత జగన్ అరెస్టు జరుగుతుందని ఆయన అన్నారు.

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు తర్వాత వైయస్ జగన్ స్వరంలో మార్పు వచ్చిందని తెలుగుదేశం సీనియర్ నాయకుడు కె. ఎర్రంనాయుడు అన్నారు. ఢిల్లీ వెళ్లి జగన్ కాంగ్రెసుతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని, అందుకే కాంగ్రెసుపై విమర్శలు చేయడం లేదని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. బాన్సువాడలో కాంగ్రెసు పోటీపై తెరాస ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు పరస్పరం కుమ్మలాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మంత్రులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుంటే వారిని బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని ఆయన అన్నారు. ప్రజలకు, ఉద్యోగులకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. ప్రజల ఆస్తులను, ప్రాణాలను కాపాడలేని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఆయన అన్నారు. సమీక్షల పేరుతో ముఖ్యమంత్రి కాలం వెళ్లదీస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+