ప్రధాని మన్మోహన్‌కు తెలంగాణ కాంగ్రెసు లేఖాస్త్రం

పార్టీని, ప్రభుత్వాన్ని గౌరవిస్తూ తాము ఒత్తిడిని ఎదుర్కుంటున్నామని, అయితే ఇంకెంత మాత్రమూ దాన్ని ఎదుర్కోలేమని, తక్షణమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన చేయాలని వారు కోరుతున్నారు. తెలంగాణ రగిలిపోతోందని, వెంటనే తెలంగాణ ప్రకటన చేయాలని రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు అన్నారు. తెలంగాణ ప్రకటన చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతోందని ఆయన అన్నారు. రాజీనామాలు చేస్తే తెలంగాణ వస్తుందంటే తాము అందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు అంటున్నారు. తెలంగాణ సకల జనుల సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిపై ప్రధానికి రాసిన లేఖలో వారు వివరించారు.












Click it and Unblock the Notifications