తెలంగాణపై నేను చెప్పనంటే చెప్పను: చంద్రబాబు

ప్రజల మనోభావాల ప్రకారం నడుచుకోవాలని తాను ఇరు ప్రాంతాల పార్టీ నాయకులను ఆదేశించానని, తాను మాత్రం ఏ విషయమూ బయటకు చెప్పనని ఆయన అన్నారు. తమ పార్టీని దెబ్బ తీసేందుకు కాంగ్రెసు తెలంగాణవాదాన్ని వాడుకుంటోందని, అయితే తమ పార్టీని దెబ్బ తీయడం ఎవరి వల్ల కూడా కాదని ఆయన అన్నారు. అధికారం కాంగ్రెసు పార్టీదని, తెలంగాణపై నిర్ణయం తీసుకునే బాధ్యత కూడా కాంగ్రెసు పార్టీదేనని, ఇదే విషయాన్ని తాను కేంద్ర హోం మంత్రి చిదంబరానికి చెప్పానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications