బాబు హామీ ఇస్తే మేం ఆలోచిస్తాం: కెటిఆర్ ప్రతి సవాల్

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడానికే బాన్సువాడకు బస్సుయాత్రతో బయలుదేరారని విమర్శించారు. త్వరలో తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఢిల్లీ వెళ్లనున్నట్లు చెప్పారు. బాన్సువాడలో తాను పోటీ చేయవద్దని తెలంగాణ తెలుగుదేశం పార్టీ చెప్పడం మిలీనియం జోక్ అని తెరాస నుండి పోటీ చేస్తున్నా మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాగా తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం అరెస్టును తెరాస చీఫ్ కె చంద్రశేఖర రావు, ఎంపీ విజయశాంతి ఖండించారు. ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించ వద్దన్నారు. తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ర్యాలీకి మద్దతిస్తేనే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications