సోనియా అంతర్జాతీయమంటారేమో?: రేవంత్ రెడ్డి

కాగా తాము రాయల తెలంగాణ ఒప్పుకునే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు వేరుగా అన్నారు. 1956కు ముందు తెలంగాణే తమకు కావాలన్నారు. హైదరాబాదు లేని తెలంగాణ ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. తమ రాజీనామాలు కావాలనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ కలిసి తొక్కి పెడుతున్నారని తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. రాజీనామాలో లాలూచి లేదన్నారు. సమైక్యాంధ్ర కోసమే తమ రాజీనామాలు తొక్కి పెడుతున్నారన్నారు. రాయల తెలంగాణ ఒప్పుకునేది లేదన్నారు.












Click it and Unblock the Notifications