అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత: ఆకాశవాణి టవరెక్కిన హోంగార్డు

జై తెలంగాణ నినాదాలు చేస్తుండటంతో పాటు విధుల నుండి తొలగించిన హోంగార్డులను విధుల్లోకి తీసుకోవాలని ఆతను డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇటీవల చాలామంది హోంగార్డులను ప్రభుత్వం విధుల నుండి తొలగించింది. అయితే అతను జై తెలంగాణ నినాదాలు చేస్తూ సస్పెండైన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తుండటం విశేషం. కాగా ఇటీవల ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన ఓ యువకుడు కోఠిలోని హోర్డింగ్ ఎక్కి ఎనిమిది గంటల పాటు నానా హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత గద్దర్ జోక్యంతో రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో హోర్డింగ్ దిగాడు.












Click it and Unblock the Notifications