తెలంగాణ తేల్చకపోతే అధ్వాన్నం: సోనియాతో ఆజాద్

అయితే అధిష్టానమే సమన్వయంతోకూడిన నిర్ణయం తీసుకోవాలని లేదంటే పార్టీకి నష్టమని చెప్పారు. అధిష్టానం వైఖరి గుర్తించకుండా ఇరు ప్రాంతాల నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పార్టీ తన వైఖరి ప్రకటించి వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీ పరిస్థితులపై అధిష్టానం జోక్యం చేసుకోకుంటే పార్టీకి నష్టమని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న సకల జనుల సమ్మె వల్ల అభివృద్ధి పూర్తిగా కుంటుపడి పోయిందని చెప్పారు. త్వరలో ఏదో ఒకటి తేల్చాలని పట్టుపట్టినట్లుగా తెలుస్తోంది.
ఈ నివేదికలో ఆజాద్ రెండు ప్రత్యామ్నాయాలు సూచించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదును కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉంచాలని దాని నుండి వచ్చే ఆదాయాన్ని రెండు ప్రాంతాలకు పంచాలని ఇరు ప్రాంతాలు తమ తమ రాజధాని ఏర్పాటు చేసుకున్నాక హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాకాని పక్షంలో హైదరాబాదును చంఢీగడ్ తరహా ఉమ్మడి రాజధానిగానే ఎప్పుడూ ఉంచాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రాన్ని విభజించడం మాత్రం ఖాయమని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణపై తాను ఆజాద్ నివేదిక వెలువడిన తర్వాత మాట్లాడతానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చెప్పారు.












Click it and Unblock the Notifications