హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాయల తెలంగాణ ఒప్పుకోం: సిపిఐ నేత నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: తాము ఎట్టి పరిస్థితుల్లో రాయల తెలంగాణకు ఒప్పుకునేది లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ శుక్రవారం స్పష్టం చేశారు. రాయల తెలంగాణ పేరుతో కొందరు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తప్పు దారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం మదిలో రాయల తెలంగాణ ఆలోచన ఉందనే అంశంపై ఆయన స్పందిస్తూ సిపిఐ దానికి వ్యతిరేకం అన్నారు. అది అసాధ్యమన్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణ మాత్రమే కావాలన్నారు. చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావు పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలు చేశారని వారిని వెంటనే విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.

అవినీతి ఆరోపణలపై మంత్రులను విచారించకుండా శంకర్ రావును బర్తరఫ్ చేయడం శోచనీయమన్నారు. ఆయనను బర్తరఫ్ చేయడమంటే అవినీతిని భూస్థాపితం చేయడమేనన్నారు. మంత్రులు నిత్యం గవర్నర్ నరసింహన్ చుట్టూ తిరగడం అప్రజాస్వామికం అన్నారు. వారు గవర్నర్ చుట్టూ తిరగడం మాని విచారణ ఎదుర్కోవాల్నారు. గవర్నర్ కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

English summary
CPI state secretary Narayana said today that they will not ready to accept Rayala Telangana. He blamed state ministers for rounding to Rajbhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X