జగన్ ధర్నాకు చుక్కెదురు, లగడపాటి సత్యాగ్రహ విరమణ

వైయస్ జగన్ ధర్నాకు అనుమతి నిరాకరించడం పట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జలీల్ ఖాన్ నిరసన వ్యక్తం చేశారు. జలీల్ ఖాన్‌కు ఫోన్ చేసి జగన్ ధర్నాకు అనుమతి నిరాకరిస్తున్నట్లు విజయవాడ పోలీసు కమిషనర్ చెప్పారు. అధికార పార్టీ నాయకుల కార్యక్రమాలకు పోలీసులు అభ్యంతరం చెప్పడం లేదని, తమ కార్యక్రమాలకే అడ్డు చెబుతున్నారని జలీల్ ఖాన్ అన్నారు. పోలీసులు అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా జగన్ దీక్ష సాగుతుందని ఆయన అన్నారు. తమ బాధ్యతగా పోలీసులకు తెలియజేశామని ఆయన అన్నారు. విజయవాడ సబ్ కలెక్టరేట్ వద్ద జగన్ రేపు శనివారం ఉదయం దీక్షను ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications